బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ మధ్య విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించి.. టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని నేను కోహ్లీకి చెప్పను. కానీ వినలేదు. దాన్తజో వైట్ బల్ ఫార్మటు లో ఇద్దరు కెప్టెన్ లు ఉండకూడదు అని కోహ్లీని వన్డే కెప్టెన్ గా తప్పించారు. అయితే టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని దాదా తనకు చెప్పలేదు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు విరాట్. దాంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న వివిధ బయటకు వచ్చింది. కానీ ఈ విషయంలో చాలా మంది కోహ్లీనే తప్పుబట్టారు.
ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ వివాదం పై స్పందిస్తూ… బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి సెలక్షన్ కమిటీ తరపున మాట్లాడే అధికారం లేదని భారత అన్నారు. జట్టు సెలెక్షన్ లేదా కెప్టెన్సీకి సంబంధించిన విషయాలు ఎల్లప్పుడూ సెలెక్టర్లకే వదిలేయాలని చెప్పాడు. దాదా ఈ విషయం పై మొదట మాట్లాడారు. ఆ తర్వాత కోహ్లీ వివరణ ఇచ్చాడు అంతే. అసలు దాదా దీని పై స్పందిచకపోతే ఈ విషయం.. సెలక్టర్లు.. కెప్టెన్ కు మధ్యే ఉండేది అని చెప్పాడు.