Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు 42 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. శుక్రవారం నాడు ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై.. ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అటు రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలడంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
Read Also: NBK X PSPK Power Teaser: అన్‌స్టాపబుల్ ప్రశ్నలతో పవన్‌కి బాలయ్య ఫిట్టింగ్స్..?
ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు. కెప్టెన్ అజింక్యా రహానే, స్టార్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ రవాల్(114)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా తాజా సీజన్‌లో గ్రూప్-బిలో ఐదు మ్యాచ్‌లలోఢిల్లీ మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకొని, ఒక విజయం సాధించి రెండింటిలో ఓటమి పాలైంది.