DPL Players Fight: డీపీఎల్లో ఉద్రిక్తత.. స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..!
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఉద్రిక్తత..
- సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ ప్లేయర్స్ మధ్య గొడవ..
- స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DPL Players Fight: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు ఎక్కువ దూకుడుగా కనిపిస్తుంటారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ మాత్రం అగ్రెసివ్ గా ఉండటం సహజమే. ఇక, లీగ్‌ల విషయాని వస్తే.. ఇక్కడ మొత్తం కమర్షియల్.. గెలుపు కోసం చూస్తారే తప్పా గొడవలకు దిగడం చాలా తక్కువ.. కానీ, దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల ప్లేయర్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకానొక దశలో ఆటగాళ్లు కొట్టుకొనే వరకూ వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Read Also: Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
అయితే, డీపీఎల్ 2025 నాకౌట్ దశకు చేరుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కొనసాగింది.. మొదట సౌత్ ఢిల్లీ బ్యాటింగ్‌కు వచ్చి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన వెస్ట్ ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక, ఓపెనర్ క్రిష్ యాదవ్ (31), మయాంక్ గుసైన్ (15*)తో కలిసి నితీశ్ (134*: 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్‌లు)తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచారు. క్రిష్ – నితీశ్ కలిసి 3 వికెట్‌కు 98 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
Read Also: Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
ఇక, నితీశ్ – క్రిష్ జోడీ మరింత దూకుడుగా ఆడుతున్న సమయంలో సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలికి క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అన్‌మోల్ శర్మ చేతికి చిక్కాడు. అప్పుడే బౌలర్ – బ్యాటర్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.. ఒకరినొకరు తొసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వారిని సహచర ఆటగాళ్ల ఆపేందుకు ప్రయత్నించారు. కీలక వికెట్ పడటంతో సౌత్ ఢిల్లీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో.. డగౌట్‌కు వెళ్తున్న క్రిష్ యాదవ్ ఏవో కామెంట్స్ చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కొట్టుకోవడంతో అంపైర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
DPL eliminator match🔥🔥🌋🌋#DPLT20 pic.twitter.com/0ag54kzNrP
— Aaditya jha (@aadi___45) August 29, 2025
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?