NTV Telugu Site icon

RCB vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Dc Vs Rcb

Dc Vs Rcb

Delhi Capitals Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇది ఈ సీజన్‌లోని 20వ మ్యాచ్. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఆర్సీబీ రంగంలోకి దిగింది. హోంగ్రౌండ్ కావడంతో.. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. పరువుకి సంబంధించిన విషయం కాబట్టి.. తప్పకుండా సత్తా చాటాల్సిందేనని ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కసిగా ఉన్నారు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ జట్టు.. రెండు మ్యాచ్‌లు ఓడి, కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. అటు.. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్‌లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో.. ఈ మ్యాచ్‌తోనే ఖాతా తెరవాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్ తిరిగి రాగా.. ఆర్సీబీ జట్టులోకి వనిందు హాసరంగా చేరాడు.

JioCinema: జియో సినిమాకు ఇక ఛార్జీలు.. ఐపీఎల్ తర్వాత ప్రారంభం..

తుదిజట్లు ఇవే:
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.
డీసీ: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్.

Show comments