Site icon NTV Telugu

SRH vs DC: కుప్పకూలిన టాపార్డర్.. 10 ఓవర్లలో డీసీ పరిస్థితి ఇది!

Dc 10 Overs Innings

Dc 10 Overs Innings

Delhi Capitals Scored 72 Runs With 5 Wickets Loss In First 10 Overs Against SRH: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మొదటి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ కాసేపు పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా.. మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి బ్యాటింగ్ చూసి.. ఈరోజు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా భావించారు. కానీ.. 39 పరుగుల వద్ద టి.నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Kenya Cult Deaths: జీసస్‌ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి

ఆ తర్వాత కాసేపటికే డేవిడ్ వార్నర్ కూడా ఔటయ్యాడు. ఫ్లిప్ షాట్ కొట్టబోయి, ఫీల్డింగ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే సర్ఫరాజ్, అమన్ ఖాన్‌లు కూడా.. అతని వెంటే పెవిలియన్ బాట పట్టారు. ఇలా పది ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోయిన డీసీ జట్టు.. కేవలం 72 పరుగులు చేసింది. వార్నర్, మార్ష్ మధ్యలో కాస్త మెరుపులు మెరిపించడం వల్ల.. స్కోరు అంత మాత్రం వచ్చింది. మిగతా వాళ్లు మాత్రం.. కనీస పోరాట పటిమ కనబర్చుకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే, అక్షర్ పటేల్ ఉన్నారు. వీళ్లిద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లే కాబట్టి.. వీళ్లే కష్టాల్లో ఉన్న తమ డీసీ జట్టుని కాపాడుకోవాలి. మెరుగైన ఇన్నింగ్స్ ఆడి.. గౌరవప్రదమైన స్కోరుని జోడించాలి. మరి.. వీళ్లు ఎంతమేర రాణిస్తారో చూడాలి.

Exit mobile version