NTV Telugu Site icon

DC vs RCB: విధ్వంసం సృష్టిస్తున్న డీసీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Dc Score

Dc Score

Delhi Capitals Scored 115 In First 10 Overs: ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో ఎప్పుడు లేనంతగా పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఆర్సీబీ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకుంటోంది. తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసిందంటే.. ఏ రేంజ్‌లో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే డీసీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ దూకుడు ప్రదర్శించారు. ఫోర్లు, సిక్సులతో వాళ్లు విరుచుకుపడ్డారు. బంతులు ఎక్కువగా వృధా చేయకుండా.. బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా.. ఫిల్ సాల్ట్ అయితే రేపన్నదే లేదన్నట్టుగా దండయాత్ర చేస్తున్నాడు. ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

SSC and Inter Results : తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్‌.. వారంలో ఫలితాలు

అయితే.. డేవిడ్ వార్నర్ అనుకోకుండా ఒక అనవసరమైన షాట్ జోలికి వెళ్లి, క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి వచ్చిన మిచెల్ మార్ష్.. వచ్చి రావడంతోనే చెలరేగి ఆడటం మొదలుపెట్టాడు. ఇక ఫిల్ మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్నాడు కాబట్టి, అతడు వేగంగా తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లోనే అతగాడు 7 ఫోర్లు, 4 సిక్సర్ల సహకారంతో 64 పరుగులు చేశాడు. ఇతడు సృష్టించిన విలయతాండవం కారణంగానే ఢిల్లీ స్కోరు జెట్ స్పీడ్‌లా పరుగు తీస్తోంది. అటు మార్ష్ సైతం అదే రేంజ్‌లో దూసుకెళ్లాలని ట్రై చేశాడు కానీ, ఆ జోష్‌లోనే అతడు పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అతడు 26 పరుగులు చేసి.. క్యాచ్ ఔట్ అయ్యాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 52 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా