NTV Telugu Site icon

CSK vs DC: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. ఢీల్లీ లక్ష్యం ఎంతంటే?

Csk 20 Over

Csk 20 Over

Delhi Capitals Need 168 Runs To Win Against CSK: చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. శివమ్ దూబే ఒక్కడే 25 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. రుతురాజ్ (24), రహానే (21), రాయుడు (23), జడేజా (21), ధోని (20).. ఇలా అందరూ తక్కువ స్కోర్లతో రాణించారంతే! ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. నిజానికి.. ఇది చెన్నై హోమ్‌గ్రౌండ్ కావడంతో ఆ జట్టు పరుగుల సునామీ సృష్టించి, 200 కు పైగా భారీ స్కోరు చేస్తుందని మొదట్లో అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఢిల్లీ బౌలర్లు 167 పరుగులకే కట్టడి చేశారు.

Anasuya: ‘THE’ వివాదంలోకి ఎంటర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్..

తమ జట్టుకి ఎప్పుడూ శుభారంభం అందించే రుతురాజ్, కాన్వే (10).. ఈసారి ఆశాజనకంగా రాణించలేదు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. రహానే కొద్దిసేపు క్రీజులో ఉన్నా.. బీస్ట్ మోడ్ మాత్రం ఆన్ చేయలేదు. 21 పరుగులతోనే సర్దుబాటు చేసుకున్నాడు. మోయిన్ అలీ సైతం ఈసారి చేతులెత్తేశాడు. 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే ఒక్కడే కొంచెం మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 3 సిక్స్‌లతో 25 పరుగులు చేశాడు. ఆ ఊపులోనే ఓ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. అంబటి రాయుడు 23 వ్యక్తిగత స్కోర్‌తో పర్వాలేదనిపించాడంతే! చివర్లో జడేజా, ధోనీ మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే స్కోరు పరుగులు పెట్టింది. ధోనీ 9 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి 20 పరుగులు చేశాడు. బౌండరీల మోత మోగించాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్‌గా షాట్ కొడితే, అది నేరుగా వార్నర్ చేతికి చిక్కింది.

Bandi Sanjay : భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి

ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికొస్తే.. మిచెల్ మార్ష్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లు వేసిన అతగాడు కేవలం 18 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా పొదుపుగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఖలీల్, లలిత్, కుల్దీప్ తలా వికెట్ పడగొట్టారు. ఇషాంత్ శర్మ ఒక్కడే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లే వేసిన అతడు 23 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీ జట్టుకి 168 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. ఢిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Show comments