Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
- 150వ టీ20ఐలో దీప్తి శర్మ చరిత్ర
- 171 వికెట్లతో ప్రపంచ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepti Sharma Breaks World Record: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ ఘన విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కెరీర్లో 150వ టీ20ఐ మ్యాచ్ ఆడిన దీప్తి.. కేవలం 7 బంతుల్లో 3 వికెట్లు తీసి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అద్భుత రికార్డు సృష్టించింది.
మహిళల టీ20ఐలో అత్యధిక వికెట్ల రికార్డు
థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది. ఆమె ఖాతాలో ఇప్పుడు 171 వికెట్లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు ఈ రికార్డును కలిగి ఉన్న థాయ్‌లాండ్ బౌలర్ థిపాచా పుత్తావోంగ్ను దీప్తి అధిగమించింది. థిపాచా 170 వికెట్లతో రెండో స్థానానికి చేరింది. రువాండాకు చెందిన హెన్రియెట్ ఇషిమ్వే 164 వికెట్లతో మూడో స్థానంలో, ఇంగ్లాండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ 154 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
మహిళల టీ20ఐలో అత్యధిక వికెట్లు:
దీప్తి శర్మ – 171 వికెట్లు
థిపాచా పుత్తావోంగ్ – 170 వికెట్లు
హెన్రియెట్ ఇషిమ్వే – 164 వికెట్లు
సోఫీ ఎక్లెస్టోన్ -154 వికెట్లు
క్యారీ చాన్ – 153 వికెట్లు
7 బంతులు.. 3 వికెట్లు.. 0 పరుగులు
దీప్తి శర్మ బౌలింగ్ గణాంకాలు ఈ మ్యాచ్‌లో ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది. ఆమె కేవలం 1.1 ఓవర్లు అంటే 7 బంతులు మాత్రమే వేసి 3 వికెట్లు పడగొట్టింది. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చివరి వికెట్‌ను కూడా దీప్తే తీసి థాయ్‌లాండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. ముఖ్యంగా ఆమె తన స్పెల్‌లో తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసుకోవడం విశేషం. అనంతరం చివరి ఓవర్లో తిరిగి బౌలింగ్‌కు వచ్చి నన్నపట్ కొంచరోయెంకై వికెట్‌ను పడగొట్టి తన రికార్డును పూర్తి చేసింది.
150వ టీ20 మ్యాచ్‌లోనే చరిత్ర
థాయ్‌లాండ్‌తో మ్యాచ్ దీప్తి శర్మకు మరో ప్రత్యేకమైన మైలురాయిని అందించింది. ఇది ఆమెకు 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. దీంతో 150 టీ20ఐ మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి చేరింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 150 లేదా అంతకంటే ఎక్కువ మహిళల టీ20ఐలు ఆడిన క్రికెటర్లలో ఆమె 12వ క్రీడాకారిణి.
షఫాలీ వర్మ విధ్వంసక బ్యాటింగ్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుత ఆరంభాన్ని అందించింది. ఆమె కేవలం 36 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే షఫాలీ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ కాస్త తడబడింది. థాయ్‌లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసుకోవడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
65 పరుగులకే థాయ్‌లాండ్ ఆలౌట్
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 94 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీప్తి శర్మతో పాటు నందిని శర్మ కూడా మూడు వికెట్లు తీసి థాయ్‌లాండ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. థాయ్‌లాండ్ తరఫున నన్నపట్ కొంచరోయెంకై మాత్రమే 41 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించింది. కానీ మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
భారత్‌కు ఘనమైన ఆరంభం
మహిళల ఆసియా కప్‌లో టీమిండియా 94 పరుగుల విజయంతో శుభారంభం చేసింది. ఒకవైపు షఫాలీ వర్మ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగా.. మరోవైపు దీప్తి శర్మ బంతితో చరిత్ర సృష్టించింది. 150వ టీ20ఐ మ్యాచ్‌లోనే 7 బంతుల్లో 3 వికెట్లు, 0 పరుగులు.. మహిళల టీ20ఐలో అత్యధిక వికెట్ల రికార్డు- దీప్తి శర్మకు ఈ మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!