ఐపీఎల్‌లో కొత్త జట్ల సమరం ఆసక్తికరంగా సాగింది. సోమవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో టీమ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ ఈ వికెట్ సాధించాడు. షమీ విజృంభించడంతో లక్నో టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీష్ పాండే (6) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లక్నో జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనే అనుమానాలు కలిగాయి.
అయితే దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) ఇద్దరూ తమ టీమ్‌ను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడారు. 10 ఓవర్ల తర్వాత ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. కృనాల్ పాండ్యా (21) వేగంగా ఆడటంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
