NTV Telugu Site icon

IPL 2023 : డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డ్.. కోహ్లీ, ధావన్ తర్వాతే..

David Warner

David Warner

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 65 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ టీమ్ 200 పరుగులు లక్ష్యాన్ని ఢిల్లీ జట్టుకు ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన డేవిడ్ భాయ్ టీమ్ కేవలం 143 పరగులు మాత్రమే చేసి 65 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓడినప్పటికీ ఓ అరుదైన రికార్డును డేవిడ్ వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఐపీఎల్ ఎలైట్ క్లబ్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్ తో ఈ లీగ్ లోనే అత్యధిక పరుగులు సాధించిన మొదటి విదేశీ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

Also Read : IPL 2023 : గుజరాత్ ను ఢీ కొట్టనున్న కోల్ కతా

ఇక ఘనత సాధించిన వాడిగా డేవిడ్ వార్నర్ మూడో వ్యక్తిగా ఉన్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 56 బంతులలో 65 రన్స్ స్కోర్ చేశాడు. అలా ఐపీఎల్ లో 6 వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. ఇక వార్నర్ కంటే ముందు ఈ లిస్ట్ లో టీమ్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు. ఆర్సీబీ టీమ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 225 మ్యాచ్ ల్లో 36.55 సగటుతో 6,727 పరుగుల చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 208 మ్యాచ్ ల్లో 35.58 సగటుతో 6,370 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత డేవిడ్ వార్నర్ 165 మ్యాచ్ ల్లో 42.23 సగటుతో 6,039 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 57 అర్థ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ తర్వాత ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇతను 229 మ్యాచ్ ల్లో 30.22 సగటుతో 5,893 పరుగుల స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా.. 205 మ్యాచ్ ల్లో 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. దీంతో ఈ టాప్ జాబితాలో నాలుగు ఇండియన్ ప్లేయర్స్ ఉండగా ఒక విదేవీ ఆటగాడు ఉన్నాడు.

Also Read : MLA Kethireddy VenkatramiReddy: ఎమ్మెల్యేకే కౌంటరిచ్చిన మహిళ.. ఎక్కడంటే?

Show comments