Site icon NTV Telugu

PV Sindhu: వెల్‌డన్ సింధు.. డేవిడ్ వార్నర్‌ స్పెషల్ విషెస్

Pv Sindhu David Warner

Pv Sindhu David Warner

PV Sindhu: తెలుగు తేజం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత పీవీ సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. సింధుకి ఈ స్వర్ణం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే గత రెండు కామన్వెల్త్‌లలో ఆమె బంగారు పతకాన్ని సాధించలేకపోయింది. బర్మింగ్‌హామ్‌లో మాత్రం ఆ కలను నెరవేర్చుకుంది. కాగా సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్, జగన్‌తో సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కాగా స్వర్ణం సాధించిన తెలుగు తేజానికి ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఆయన భార్య క్యాండిస్‌ కూడా కంగ్రాట్స్‌ చెప్పారు.

Commonwealth Games 2002: గేమ్స్ కోసం వెళ్లి.. మాయమైన 10 మంది లంక అథ్లెట్లు

సింధుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశాడు. ‘‘వెల్‌డన్‌ సింధు.. అద్భుతమైన విజయం. పరిపూర్ణం’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. కామన్వెల్త్‌లో బంగారు పతకం గెల్చుకున్నందుకు కంగ్రాట్స్‌ సింధు.. నీ విజయం ఎంతో అద్భుతం’ అని వార్నర్‌ సతీమణి క్యాండిస్‌ మెసేజ్‌ చేసింది. దీనికి సింధు కూడా స్పందించింది. ‘థ్యాంక్స్‌ ఏ లాట్‌’ అని ఇద్దరికి రిప్లై ఇచ్చింది. కాగా వార్నర్‌ దంపతుల ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డేవిడ్‌ భాయ్‌ మళ్లీ మా భారతీయుల మనసులు గెల్చుకున్నావని ఫ్యాన్స్‌ అంటున్నారు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాదీలకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే.

Exit mobile version