తెలుగు తేజం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత పీవీ సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.