South Africa: రాంచీలో నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ మిల్లర్ కుమార్తె శనివారం నాడు మృతి చెందింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘రిప్ మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయితే కొందరు ఆమె మిల్లర్ కుమార్తె కాదని.. మిల్లర్ అభిమాని అంటూ వాదిస్తున్నారు. తన కుమార్తె అని మిల్లర్ తన పోస్టులో పెట్టకపోవడమే దీనికి కారణమని చెప్తున్నారు. దీంతో చనిపోయిన చిన్నారి మిల్లర్ కుమార్తె లేదా అభిమాని అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.
Read Also: Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్
కాగా దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారత్‌లో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. దీంతో డేవిడ్ మిల్లర్ ఇండియాలోనే ఉన్నాడు. రాంచీలో భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలి వన్డేలో మిల్లర్ 63 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరి చనిపోయిన చిన్నారి తన కుమార్తె అయితే రెండో వన్డేలో డేవిడ్ మిల్లర్ పాల్గొనే అవకాశం ఉండదు. రాంచీలో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాంచీలో టీమిండియా ఇప్పటివరకు ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడగా.. రెండు గెలిచి మరో 2 మ్యాచ్‌లలో ఓడింది. ఒకటి ఫలితం తేలలేదు.