Site icon NTV Telugu

Danish Kaneria: పాకిస్థాన్ మాజీ బౌలర్ సందేహాలు.. ఆసియా కప్‌కు కూడా కోహ్లీని పక్కన పెడతారేమో?

Virat Kohli

Virat Kohli

Danish Kaneria comments on virat kohli: పేలవ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. జింబాబ్వేలో జరిగే వన్డే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేస్తే అతడు గాడిలో పడే అవకాశాలు ఉండేవని కనేరియా అభిప్రాయపడ్డాడు. కోహ్లీని జింబాబ్వే పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు. పరిస్థితులను గమనిస్తుంటే ఆసియా కప్‌కు కూడా కోహ్లీని ఎంపిక చేయరేమో అని డానిష్ కనేరియా సందేహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ పెద్ద టోర్నీల్లో మాత్రమే ఆడాలని బీసీసీఐ కోరుకోవడంలో అర్ధం ఉందా అని ప్రశ్నించాడు. ఒకవేళ పెద్ద టోర్నీలలో కోహ్లీ విఫలమైతే నష్టం ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో బీసీసీఐ ఉందా అని నిలదీశాడు. ఎటొచ్చీ అప్పుడు మళ్లీ అన్ని వేళ్లు కోహ్లీ వైపే చూపిస్తాయని.. అప్పుడు అతడు మరింత సంధి కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.

Read Also: Common Wealth Games 2022: భారత్‌కు మరో బంగారు పతకం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో జెరెమీకి గోల్డ్

టీమిండియాలో ఓ పద్ధతి ప్రకారం విరాట్ కోహ్లీకి అన్యాయం జరుగుతోందని డానిష్ కనేరియా వెల్లడించాడు. వెస్టిండీస్ పర్యటన మొత్తానికి విశ్రాంతి ఇచ్చినప్పుడు జింబాబ్వే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేస్తే బీసీసీఐకి వచ్చిన నష్టమేంటని కనేరియా ప్రశ్నించాడు. టీ20లలో ఎక్కువగా నిలదొక్కుకునే అవకాశం ఉండదని.. అదే వన్డే ఫార్మాట్‌లో నిలదొక్కుకునే అవకాశం దొరుకుతుందని.. జింబాబ్వే సిరీస్‌లో కోహ్లీకి ఆ వెసులుబాటు దొరిదేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు కోహ్లీకి ఎంత రెస్ట్ కావాలో తనకైతే అర్ధం కాకుండా ఉందని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్ స్థానంలో కోహ్లీ జింబాబ్వే పర్యటనకు ఎంపిక కావాల్సిందని కనేరియా వ్యాఖ్యానించాడు. అప్పుడు సంజు శాంసన్ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేవాడు అని వివరించాడు.

Exit mobile version