IPL 2023 : ఎంఎస్ ధోని కొట్టింది 3 సిక్సులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీజ్ సీజన్ 16లో టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని దుమ్మురేపుతున్నాడు. 41 ఏళ్ల వయసులో అసాధారణ బ్యాటింగ్ తో పాత ధోనిని తలపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ధోని తన బ్యాటింగ్ తో ఆ జట్టును ఓడించినంత పని చేశాడు. చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. ధోని వరుసగా రెండు భారీ సిక్సులు బాది మ్యాచ్ ను గెలిపించినంత పని చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అద్బుతంగా బౌలింగ్ చేయడం.. చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. 30 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్ కి వచ్చిన ధోని.. జడేజాతో కలిసి గెలిపించినంత పనిచేశాడు. మొత్తం మూడు సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టి అభిమానులందర్నీ అలరించాడు.
Read Also : Opposition Unity: నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ఈ మ్యాచ్ లో ధోని ఆడింది కేవలం 17 బంతులే అయినా.. 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేసినప్పుడు 1.7 కోట్ల వ్యూస్ రాగా.. ఆర్సీబీ-లక్నో మ్యాచ్ లో 1.8 వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా మ్యాచ్ బ్రేక్ చేసింది.
Read Also : MS DHONI : ఆ మిస్టెక్ వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం..
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. బట్లర్ ( 52), హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్ ( 38), అశ్విన్ ( 30), హెట్మేయర్ ( 30) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా తల రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ ఆలీ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే ( 50) హాఫ్ సెంచరీ చేయగా.. రహానే ( 38), ధోని (32) నాటౌట్ విలువైన పరుగులతో రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీశారు.

తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!