CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Set for Another Blow Ahead of IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడగా.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా జట్టుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యాడని పలు అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టీఫెన్ ఫ్లెమింగ్.. తన కోచింగ్ బృందంలో బ్యాటింగ్ కోచ్‌గా చేరాలని మైకేల్ హస్సీని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్లెమింగ్, హస్సీలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో అధికారిక ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 51 ఏళ్ల హస్సీ ‘ది హండ్రెడ్’ టోర్నీలో వెల్ష్ ఫైర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా కూడా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టులో చేరాలా? లేక సీఎస్కేతోనే కొనసాగాలా? అనే విషయంపై హస్సీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
స్టీఫెన్ ఫ్లెమింగ్, మైకేల్ హస్సీల మధ్య దాదాపు 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఇద్దరూ సీఎస్కే తరఫున కలిసి ఆడారు. అనంతరం ఫ్లెమింగ్ హెడ్ కోచ్‌గా.. హస్సీ బ్యాటింగ్ కోచ్‌గా కలిసి చెన్నై జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ఇప్పుడు అదే జోడీ ఇంగ్లండ్ జట్టులో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఫ్లెమింగ్ డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆగస్టు 19 నుంచి పాకిస్థాన్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌కు మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
బౌలింగ్ కోచ్ విషయంలో కూడా సీఎస్కేతో అనుబంధం ఉన్న మరో కోచ్ ఎరిక్ సిమన్స్‌ను ఇంగ్లండ్ జట్టులోకి తీసుకురావాలని స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం సిమన్స్ సీఎస్కేకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు. గతంలో భారత జట్టు 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో కోచ్‌గా పనిచేశారు. ఒకవేళ హస్సీ కూడా ఇంగ్లండ్ జట్టులో చేరితే.. చెన్నై కోచింగ్ విభాగంలో భారీ మార్పులు తప్పవు. ఇప్పటికే జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంది.. ఇప్పుడు హస్సీ కూడా వెళ్ళిపోతే సీఎస్కే పరిస్థితి దారుణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై భవిష్యత్‌పై ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!