NTV Telugu Site icon

Cheteshwar Pujara: భారత జట్టులో దక్కని చోటు.. చెతేశ్వర్‌ పుజారా కీలక నిర్ణయం!

Cheteshwar Pujara Shot

Cheteshwar Pujara Shot

Cheteshwar Pujara Plans to Play Duleep Trophy 2023: టీమిండియా ‘నయా వాల్‌’ చతేశ్వర్‌ పూజారాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్న పూజారాపై వేటు వేసింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో పుజారాకు చోటు ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. దాంతో పుజారా కెరీర్‌ దాదాపు ఎండ్ అయినట్లే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా తిరిగి జట్టులోకి రావాలని ప్రయత్నంలో ఉన్న పూజ‌రా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు.

జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో దేశవాళీ క్రికెట్ ఆడాలని చతేశ్వర్‌ పూజారా నిర్ణయం తీసుకున్నాడు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2023లో అతడు ఆడనున్నాడు. ఆడడమే కాదు భారీగా పరుగులు చేయాలని భావిస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో పూజారా వెస్ట్ జోన్ జట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. పూజ‌రాతో పాటు మిస్టర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్‌ కూడా వెస్ట్ జోన్ జ‌ట్టులో ఆడనున్నాడు. విండీస్‌తో వ‌న్డే సిరీస్ సమయానికి సూర్య భారత జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. జూన్ 28న దులీప్ ట్రోఫీ మొద‌ల‌వ్వ‌నుంది. ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!

ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ 2023లో చతేశ్వర్‌ పూజారా తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 14, 27 పరుగులు మాత్రమే చేశాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ముందు ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కౌంటీల్లో అద్భుతంగా రాణించాడు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదాడు. అయితే కీలక డబ్ల్యూటీసీ ఫైన‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. గత మూడేళ్లుగా రాణించని పుజారాపై బీసీసీఐ ఇప్పుడు వేటు వేసింది. పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటు, 44.4 స్ట్రైక్ రేట్‌తో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 206 నాటౌట్.

భారత టెస్ట్ జట్టు (India Test Squad):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

Also Read: Cheteshwar Pujara Retirement: ‘నయా వాల్’ చెతేశ్వర్‌ పుజారా కెరీర్ ముగిసినట్లేనా?

Show comments