BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను శనివారం నాడు బీసీసీఐ వెల్లడించింది. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ మేరకు ఖరారు చేసింది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌ను వదిలి పారిపోతున్న కంపెనీలు.. సుజుకీ, టొయోటా గుడ్ బై
Also Read
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
- Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
గత సెలలెక్షన్ కమిటీ కాలపరిమితి 2022 డిసెంబరుతో ముగిసింది. గత నవంబరు 18న ఐదుగురు సెలెక్టర్ల పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా, 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసిన సీఏసీ తాజా నియామకాలు చేపట్టింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ టెస్ట్ ఓపెనర్ శివ సుందర్ దాస్ సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మాజీ పేసర్ సుబ్రోతో బెనర్జీ ఈస్ట్ జోన్, సలిల్ అంకోల వెస్ట్ జోన్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. మళ్లీ ఆయన్నే ఛైర్మన్‌గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!