NTV Telugu Site icon

BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మ నియామకం

Bcci

Bcci

BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను శనివారం నాడు బీసీసీఐ వెల్లడించింది. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ మేరకు ఖరారు చేసింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌ను వదిలి పారిపోతున్న కంపెనీలు.. సుజుకీ, టొయోటా గుడ్ బై

గత సెలలెక్షన్ కమిటీ కాలపరిమితి 2022 డిసెంబరుతో ముగిసింది. గత నవంబరు 18న ఐదుగురు సెలెక్టర్ల పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా, 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసిన సీఏసీ తాజా నియామకాలు చేపట్టింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ టెస్ట్ ఓపెనర్ శివ సుందర్ దాస్ సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మాజీ పేసర్ సుబ్రోతో బెనర్జీ ఈస్ట్ జోన్, సలిల్ అంకోల వెస్ట్ జోన్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. మళ్లీ ఆయన్నే ఛైర్మన్‌గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.