NTV Telugu Site icon

CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

Csk Vs Gt

Csk Vs Gt

Chennai Super Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ టైటిల్ కోసం చివరి పోరు జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిజానికి.. ఈ మ్యాచ్ నిన్న ఆదివారమే జరగాల్సింది. కానీ.. వర్షం ఆటంకం కలిగించడంతో, నేటికి వాయిదా వేశారు. హోరాహోరీగా జరగనున్న ఈ పోరులో.. ఎవరు విజేతగా నిలుస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Loan App Harassment: అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు

లీగ్ దశలో ఉన్నప్పుడు జీటీ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. తనకు ఎదురైన ప్రతీ జట్టుని మట్టికరిపిస్తూ.. తన ఖాతాలో ఏకంగా 20 పాయింట్లు వేసుకుంది. అంతేకాదు.. తనతో పోటీ పడినా మూడుసార్లు చెన్నై జట్టుకి చిత్తుచిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింటిలోనూ పటిష్టంగా ఉండటం వల్లే జీటీ తిరుగులేని జట్టుకి దూసుకెళ్లింది. కానీ.. ఫ్లేఆఫ్స్‌కి వచ్చేసరికి లెక్కలు కాస్త మారిపోయాయి. అప్పటివరకూ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నైపై ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ జట్టు.. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టు చేతిలో ఓడిపోయింది. సీఎక్కే నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ.. 157 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 15 పరుగుల తేడాతో సీఎస్కే విజయఢంకా మోగించి, నేరుగా ఫైనల్స్‌కు చేరింది.

MLA Kannababu: చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడు

తొలి క్వాలిఫైయర్‌లో సీఎస్కే చేతిలో ఓటమిపాలైన జీటీ.. క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టుని భారీ పరుగుల తేడాతో (61) ఓడించి, ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో తనని ఓడించినందుకు గాను సీఎస్కేపై ప్రతీకారం తీర్చుకొని.. ఐపీఎల్ టైటిల్‌ని సొంతం చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై జట్టుని ఓడించడం అంత సులువు కాదు. మరి, ఈ ఫైనల్‌లో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారు? ఐపీఎల్ టైటిల్‌ని ఏ జట్టు సొంతం చేసుకుంటుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ!