Site icon NTV Telugu

CSK vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

Csk Vs Dc

Csk Vs Dc

Chennai Super Kings Won The Toss And Chose To Bat First: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. సీఎస్కే టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న డీసీ జట్టు.. తమ ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే, ప్రస్తుతంతో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. అంటే, చెన్నైతో జరుగుతున్న తాజా మ్యాచ్ డీసీకి ఎంతో కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే, డీసీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్ సజీవంగా ఉంటాయి. లేకపోతే.. ఇంటిదారి తప్పదు. మొదట్లో వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన ఢిల్లీ జట్టు, ఆ తర్వాతి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క ఓటమినే చవిచూసింది. సీజన్ మొదట్లో కంటే, ఇప్పుడు డీసీ జట్టు పటిష్టంగా తయారైంది. ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అదే ఫామ్‌ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే.. సీఎస్కేపై ఢిల్లీ జట్టు పైచేయి సాధించడాన్ని ఎవ్వరూ ఆపలేరు.

Elon Musk: వాట్సాప్‌ని నమ్మలేం.. త్వరలో ట్విట్టర్‌లో ఆ సేవలను తీసుకువస్తాం..

మరోవైపు.. పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న సీఎస్కే జట్టు, ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని పట్టుదలతో ఉంది. చెన్నైలో బ్యాటర్లు ఎలా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారుగా! రహానే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. డెవాన్ కాన్వే నిలకడగా రాణిస్తూ.. సీఎస్కేకి బ్యాక్‌బోన్‌లా తయారయ్యాడు. రుతురాజ్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడుతూ శుభారంభాన్ని అందిస్తున్నాడు. శివమ్ దూబే కూడా విజృంభిస్తున్నాడు. మొత్తం ఏడుగురు బ్యాటర్లు ఉండటంతో.. సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఇలాంటి బ్యాటింగ్ లైనప్‌ని చెడగొట్టాలంటే.. డీసీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ సీఎస్కే ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌లో చోటు కోసం కష్టతరం అవుతుంది. కాబట్టి.. చెన్నైకి సైతం ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. మరి.. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.

Dhanush: కిల్లర్.. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. వచ్చేశాడు

Exit mobile version