NTV Telugu Site icon

CSK vs GT: గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే ఘనవిజయం

Csk Won The Match

Csk Won The Match

Chennai Super Kings Won The Match Against Gujarat Titans: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. సీఎస్కే నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని జీటీ ఛేధించలేకపోయింది. 157 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో.. 15 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొంది, ఫైనల్స్‌కు చేరుకుంది. జీటీ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ (42), రషీద్ ఖాన్ (30) మినహాయిస్తే.. మిగతా బ్యాటర్లెవ్వరూ ఆశాజనకంగా రాణించలేదు. చెన్నై బౌలింగ్ ఎటాక్ ధాటికి.. జీటీ బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలకడగా నిలబడలేకపోయారు. కాస్త జోష్ నింపినట్టే నింపి, ఆ తర్వాత ఉసూరుమనిపిస్తూ ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఈ దెబ్బకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Sunny Leone: నన్ను చంపేస్తానని బెదిరించారు.. సన్నీ సంచలన వ్యాఖ్యలు

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ (60) అర్థశతకంతో దుమ్మురేపడం, కాన్వే (40) పర్వాలేదనిపించడంతో.. చెన్నై జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు చేసింది తక్కువ పరుగులే అయినా, బంతులు వృధా చేయకుండా జట్టుకి గౌరవప్రదమైన స్కోరు జోడించడంలో తమవంతు కృషి చేశారు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చెన్నై బౌలింగ్ ధాటికి.. మొదటి నుంచే జీటీకి కష్టతరమైంది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. శుబ్మన్ గిల్ తన జట్టుని ఆదుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాడు కానీ, పాపం అతడు కూడా ఒత్తిడి తట్టుకోలేక భారీ షాట్ కొట్టబోయి ఔట్ అయ్యాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. అప్పుడే తీసుకొని ఉంటే బావుండేదిగా ..?

ఇక గుజరాత్ పని అయిపోయిందనుకున్న తరుణంలో.. రషీద్ ఖాన్ మళ్లీ ఆశలు చిగురించాడు. అతనితో పాటు విజయ్ శంకర్ కూడా కాసేపు క్రీజులో ఉండటం చూసి.. బహుశా వీళ్లిద్దరు తమ జీటీ రాత మారుస్తారని అనుకున్నారు. కానీ, ఇంతలోనే శంకర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రషీద్ ఒంటరి పోరాటం కొనసాగించే ప్రయత్నం చేశాడు కానీ, చివరికి ధోనీ వేసిన స్కెచ్‌లో అతడు ఔట్ అయ్యాడు. రషీద్ బ్యాటింగ్‌కి తగ్గ ఫీల్డింగ్ సెట్ చేయడంతో, అతడు క్యాచ్ ఔట్ అయిపోయాడు. ఆ దెబ్బకు జీటీ కథ కంచికి చేరింది. చెన్నై బౌలర్లలో తుషార్ ఒక వికెట్ తీయగా.. దీపక్ చహార్, తీక్షణ, జడేజా, పాతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అయితే.. జీటీ ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వీరికి మరో ఛాన్స్ (క్వాలిఫైయర్ 2) ఉంది.

Show comments