NTV Telugu Site icon

Yuzvendra Chahal: సమంత బాటలో చాహల్ భార్య.. అతడితో పార్టీకి హాజరుకావడమే కారణమా?

Chahal Wife

Chahal Wife

Yuzvendra Chahal: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరు మార్మోగిపోతోంది. చాహల్, అతడి భార్య ధనశ్రీ మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం కలకలం రేపింది. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ను తొలగించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం విడాకులకు దారి తీస్తుందని ఇటీవల పలు ఘటనలను నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. గత ఏడాది సమంత అక్కినేని తన పేరును సమంత రుత్ ప్రభుగా మార్చుకుంది. తర్వాత కొద్దికాలానికే సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సమంత బాటలో చాహల్ భార్య ధనశ్రీ కూడా ఇంటి పేరు తొలగించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇటీవల టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి ధనశ్రీ తన భర్త చాహల్‌తో కాకుండా శ్రేయస్ అయ్యర్‌తో వెళ్లడం కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి చాహల్, ధనశ్రీ మధ్య విభేదాలు ఉన్నాయని నెటిజన్‌లు జోరుగా చర్చించుకుంటున్నారు. కొంతమంది నెటిజన్‌లు ‘పాపం.. చాహల్’ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ ఎఫైర్ నడుపుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ధనశ్రీ విషయంలో తొందరపడొద్దని కొందరు చాహల్‌కు సూచిస్తున్నారు. కొన్నిరోజుల కిందట ధనశ్రీ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా రచ్చకు కారణమైంది. మాచర్ల నియోజకవర్గంలోని రారా రెడ్డి పాటకు ధనశ్రీ మాస్ డ్యాన్స్ చేసి కుర్రకారు మతులు పోగొట్టింది.

మరోవైపు కొన్నిరోజుల కింద చాహల్ తన సోషల్ మీడియాలో ‘న్యూ లైఫ్ లోడింగ్’అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అతడి సతీమణి ధనశ్రీ ప్రెగ్నెంట్ అయినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. త్వరలోనే చాహల్ తండ్రికానున్నాడని అభినందనలు తెలిపారు. ఇంతలోనే ధనశ్రీ పేరు మార్చుకోవడంతో చాహల్ న్యూ లైఫ్ లోడింగ్‌కు నెటిజన్‌లు కొత్త అర్థాలు వెతుకుతున్నారు. అతడు చెప్పింది శుభవార్త కాదని దుర్వార్త అంటూ కొందరు అభిమానులు నిట్టూరుస్తున్నారు. కొందరు అయితే లలిత్ మోదీ చూపు ధనశ్రీపై పడిందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.