Site icon NTV Telugu

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా

Brian Lara

Brian Lara

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్‌ఆర్‌హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది. కాంట్రాక్టును పొడిగించకూడదని మూడీ, సన్‌రైజర్స్ నిర్ణయించుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మూడీ చేసిన సేవలకు ఫ్రాంచైజీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

బ్రియాన్ లారా ఐపీఎల్ ఎడిషన్‌లో గతంలో కూడా సన్‌రైజర్స్ క్యాంప్‌లోనే ఉన్నాడు. ఫ్రాంచైజీ వ్యూహాత్మక సలహాదారు, బ్యాటింగ్ కోచ్‌గా పాత్రను పోషించారు. ఇప్పుటి నుంచి ప్రధాన కోచ్‌గా తన సేవలను అందించనున్నాడు బ్రియాన్ లారా. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ చెత్త ప్రదర్శన కనబరిచిన జట్లలో ఒకటిగా ఎస్‌ఆర్‌హెచ్ ఉంది. 2022లో 10 జట్ల టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఎనిమిది ఓటములతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో 8వ స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ అదృష్టాన్ని మార్చడంలో ఆసీస్ మాజీ క్రికెటర్ విఫలమయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ 14 గేమ్‌లలో ఆరు గెలుపొందింది.

India vs Pakistan: ఆసియా కప్‌లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌.. రేపే భారత్‌-పాక్‌ ఢీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్ పాత్రను పోషిస్తుండగా, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ఫ్రాంచైజీకి స్పిన్ బౌలింగ్, వ్యూహాత్మక కోచ్‌గా ఉన్నారు. ప్రధాన కోచ్‌గా తన కొత్త పాత్రలో బ్రియాన్ లారాకు కష్టమైన పని ఉంటుంది. గత రెండు సంవత్సరాలు ఫ్రాంఛైజీ చరిత్రలో అత్యంత చెత్తగా ఉన్నాయి.

Exit mobile version