NTV Telugu Site icon

BOXING : మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ప్రీ క్వార్టర్స్ కు నిఖత్ జరీన్

Nikhat Zareen

Nikhat Zareen

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ప్రీ-క్వార్టర్స్ మ్యాచ్ లో ఆడేందుకు అర్హత సాధించింది. ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో నిఖత్ తలపడింది. ఈ మ్యాచ్ లో 5-0తో ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్డర్స్ ఫైనల్ బెర్తు ను నిఖర్ జరీన్ ఖాయం చేసుకుంది. 50 కేజీల ఈవెంట్ లో పోటీ పడిన నిఖత్ ప్రస్తుత ఆఫ్రికన్ ఛాంపియన్ రౌమైసాను ఓడించడంతో ఈ టోర్నమెంట్ లో తన రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.

Also Read : Bhatti Vikramarka : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అప్పుల పాలైంది.. రోడ్డున పడ్డ నిరుద్యోగులు

ఈ మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే మొదటి రౌండ్ లో నిఖర్ కు తన ఆటతీరుతో విజృంభించింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారినట్లయింది. ఈ క్రమంలో ప్రత్యర్థి రౌమైసా కూడా ముందుకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించగా నిఖత్ పంచ్ లతో ఆమెను ఆలౌడ్ చేసింది. అనంతరం తరువాత రౌండ్ ను అంపైర్లు ప్రారంభించారు. ఈ ఆటలో ఇద్దరు బాక్సర్లు ఎంతో దూకుడుగా ఆడారు. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు.. కానీ చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి నిఖత్ జరీన్ విజయం సాధించింది. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ -2022లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్లలో ఒకరుగా ఉన్నారు.

Also Read : Payyavula Keshav: ఎమ్మెల్సీ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది

రౌమైసా టాప్ సీడ్ కావడం వల్ల రౌండ్ లో ఆమెకు ధీటుగా ఆడడం చాలా ముఖ్యం అని నిఖత్ జరీన్ అన్నారు. తానే టాప్ సీడ్ లుగా ఉన్న ఛాంపియన్లను ఓడిస్తే తనపై న్యాయనిర్ణేతలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. ఇంతకుముందు తానే బౌలమ్ రౌమైసా బౌట్లను చూశానని జరీన్ పేర్కొన్నారు. బాక్సింగ్ చేసేటప్పుడు మనం ఆమెకు అత్యంత దగ్గరగా వెళ్తే తాను చాలా దూకుడుగా ఆడుతుందని వెల్లడించింది. కాబట్టి ఆ అవకాశం ఆమెకు ఇవ్వకుండా చాలా దూరం నుంచి ఆడాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగానని నిఖర్ పేర్కొంది. తన వ్యూహాత్మకమైన షాట్ తో తాను ఆమె నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాను అని నిఖత్ జరీన్ తెలిపింది.