ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆప్స్ కు చేరుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే.. దీంట్లో భాగం ఇక లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్, కాన్వేలు అర్థసెంచరీలతో రాణించగా.. మధ్యలో శివమ్ దూబే, ఆఖర్లో జడేజా అద్భుమైన బ్యాటింగ్ చేశారు.
Also Read : Manchu Manoj: ఏందీ బ్రో.. ‘వాట్ ది ఫిష్’.. అర్ధం కానట్లే ఉంది
అయితే మ్యాచ్‌లో మాత్రం వీరందరిని దాటి ధోని మరోసారి హైలెట్ గా నిలిచాడు. తాను ఆడింది ఐదు బాల్స్.. చేసింది నాలుగు పరుగులే.. అయినా స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్నా సపోర్ట్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కే చేశారు. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. అందుకే స్టాండ్స్ అన్ని సీఎస్‌కే జెర్సీలతో నిండిపోయాయి.
Also Read : WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్స్..!
ఇవన్నీ ఒక ఎత్తయితే మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో మహేంద్రుడి క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా ధోని అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ఎంఎస్ ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో వరుసగా విఫలమవుతున్నారు.
Also Read : IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..
తాజాగా సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన చేతన్ సకారియా బౌలింగ్‌లో ఇది క్లీయర్ గా కనిపించింది. ఓవర్ చివరి రెండు బంతులు వేయాల్సిన చోట ఒక నోబాల్, వైడ్‌బాల్ వేశాడు. కారణం ఎదురుగా క్రీజులో ఉంది ధోని. దీంతో అటు స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లడంతో ఒత్తిడికి లోనవుతున్న బౌలర్లు బంతులను సరిగ్గా వేయడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు వాపోయారు.
