NTV Telugu Site icon

IND vs AUS World Cup Final: రేపే వరల్డ్ కప్ ఫైనల్.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు

Big Screens

Big Screens

IND vs AUS World Cup Final Match In Big Screens: రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.గోపీనాథ్‌­రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్‌ చూసేలా ఈ స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు.

Read Also: Liquor Price Hiked: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన మద్యం ధరలు..

ఈ బిగ్ స్ర్కీన్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్‌ భరిస్తోందని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్‌ స్క్రీన్లకు మంచి స్పందన రావడంతో ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించామని ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

Read Also: Post office Scheme :సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే..రూ.7 లక్షలకు పైగా రాబడి..

ఇక, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల లీడర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మైదనాల్లో బిగ్ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్ర్కీన్లను తయారు చేస్తున్నారు. ఇక, ఈ సారి వినోదాన్ని మరింత పంచేందుకు సౌండ్ బాక్సులు, లైటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు.