IND vs AUS World Cup Final: రేపే వరల్డ్ కప్ ఫైనల్.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS World Cup Final Match In Big Screens: రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఈ స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు.
Read Also: Liquor Price Hiked: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన మద్యం ధరలు..
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ఈ బిగ్ స్ర్కీన్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన రావడంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించామని ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
Read Also: Post office Scheme :సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే..రూ.7 లక్షలకు పైగా రాబడి..
ఇక, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల లీడర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మైదనాల్లో బిగ్ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్ర్కీన్లను తయారు చేస్తున్నారు. ఇక, ఈ సారి వినోదాన్ని మరింత పంచేందుకు సౌండ్ బాక్సులు, లైటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!