Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్న విధానం తనకు నచ్చడం లేదన్నాడు.
Read Also: Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్‌పై అనురాగ్ కౌంటర్
కొత్త ఫార్మాట్లు, ఫ్రాంచైజీ లీగ్‌ల కారణంగా టెస్టులు అభిమానుల ఆదరణ కోల్పోతున్నాయని.. టెస్ట్ క్రికెట్ కాకుండా ఆటగాళ్లకు చాలా అవకాశాలున్నాయని.. కానీ క్రికెట్ బతకాలంటే టెస్టులు ఆడటం కూడా ముఖ్యమే అని బెన్ స్టోక్స్ అన్నాడు. ఫలితం కంటే వినోదంపై దృష్టి సారిస్తే టెస్ట్ క్రికెట్‌కు కూడా ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశాడు. టెస్టుల్లో ఫలితం గురించి ఆలోచించడం మానేయాలని.. ప్రతిరోజూ వినోదం అందించడంపైనే దృష్టి పెట్టాలన్నాడు. ఏం జరుగుతుందో అభిమానులకు అర్ధం కాకూడదని.. ఏం చూడబోతున్నామన్న ఉత్సాహం అభిమానుల్లో కనబరిస్తే బంతి పడకముందే గెలిచినట్లు అని స్టోక్స్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు ప్రాణమని తెలిపాడు.