NTV Telugu Site icon

BCCI: రోహిత్, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరిక.. కారణం ఇదే..!!

Virat Kohli

Virat Kohli

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఓ టెస్ట్‌, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యులు జోరుగా షికారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రోహిత్‌, కోహ్లి షాపింగ్‌ అంటూ లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు.

యూకేలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ కరోనా కారణంగా జట్టుతో పాటు ట్రావెల్ చేయలేకపోయాడు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్‌, కోహ్లి మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇదే విషయంపై తాజాగా రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. టీమిండియా ఆటగాళ్లు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని.. లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Manoj Tiwari: ఉదయం క్రికెట్ ఆడతా.. సాయంత్రం మంత్రిగా పనిచేస్తా