Site icon NTV Telugu

విరాట్ కోహ్లీతో గంగూలీ, జైషా భేటీ…

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది బీసీసీఐ నిర్వహిస్తున్న టీ-20 ప్రపంచకప్‌ వేదికను కరోనా కారణంగా యూఏఈ కి మార్చిన విషయం తెలిసిందే.

Exit mobile version