Site icon NTV Telugu

ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ క్లారిటీ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు.

Read Also: విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా

ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఎలా ఉంటుందో చూసి.. పరిస్థితులకు అనుగుణంగా తాము ఐపీఎల్ నిర్వహణలో మార్పులపై నిర్ణయం తీసుకుంటామని గంగూలీ తెలిపాడు. కరోనా కారణంగా గత రెండు సీజన్‌లను యూఏఈ వేదికగా నిర్వహించారు. దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికలలో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్ ఉంటూ ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది. అయితే సొంతగడ్డపై ఆడుతున్న మజాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అందించలేకపోయాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా.. ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలనే లక్ష్యంతో బీసీసీఐ ఉంది.

Exit mobile version