NTV Telugu Site icon

కోహ్లీ ఇంకా మమల్ని అడగలేదు : బీసీసీఐ అధికారి

భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటివరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి లేదా సెక్రటరీ జే షాకి చెప్పలేదు అని అన్నారు. ఒకవేళ అతను ముందు రోజులో చెప్పిన.. లేదా దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా గాయం అయిన అతను సిరీస్ నుంచి తప్పుకుంటాడు కావచ్చు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం అయితే కోహ్లీ సౌత్ ఆఫ్రికా జట్టుతో జనవరి 19, 21, 23 తేదీల్లో జరిగే మూడు వన్డే సిరీస్ లలో పాల్గొంటాడు.

ఇక ప్రస్తుతం ఉన్న బయో-బబుల్ ఆంక్షల కారణంగా ఆటగాళ్ల కుటుంబాలు కూడా వారితో పాటు చార్టర్ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికాకు వెళ్తారని తెలిపారు. ఇక కోహ్లీ కూడా తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడు. అయితే టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీ బబుల్ అలసటతో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే… అతను ఖచ్చితంగా బీసీసీఐకి తెలియజేస్తాడు అని పేర్కొన్నారు.