Site icon NTV Telugu

BCCI New Rule: బీసీసీఐ సరికొత్త రూల్‌.. ఆ విషయంలో అంపైర్లదే తుది నిర్ణయం

Bcci

Bcci

BCCI New Rule: ఇంగ్లాండ్ టూర్ లో రిషభ్ పంత్ గాయపడిన తర్వాత కుంటుతూనే బ్యాటింగ్ కు వచ్చాడు. నొప్పిని భరిస్తూనే గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడం చూశాం.. ఇక, రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను తీసుకొని ఉంటే పంత్‌కు ఇబ్బంది తప్పేదిగా అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి సరికొత్త రూల్ తీసుకొచ్చింది. మ్యాచ్ టైంలో తీవ్రంగా గాయపడిన ప్లేయర్ స్థానంలో మరొకరిని ఆడించేలా నిబంధనల్లో మార్పు చేసింది. దేశవాళీ సీజన్ 2025-26 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రాబోతుందని బీసీసీఐ వెల్లడించింది.

Read Also: Elvish Yadav: యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల కలకలం.. బైక్‌పై వెళ్తున్న దుండగులు 25 రౌండ్ల కాల్పులు

అయితే, టెస్టులు లాంటి మల్టీ డే మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు గాయపడితే అతడి ప్లేస్ లో మరొకరిని ఆడించాల్సి ఉంటుంది. ఆ రోజు ఆట పరిస్థితులను బట్టి రీప్లేస్‌మెంట్‌కు పర్మిషన్ తీసుకోవాలి. కాగా, ఆటగాడికి మ్యాచ్ సమయంలో లేదంటే స్టేడియంలో అయినా గాయపడాలి.. అలాంటప్పుడే వాళ్లకు ఈ రూల్ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. కాగా, త్వరలో ప్రారంభం కాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ నుంచే ఈ కొత్త రూల్‌ను అమలు చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.

Read Also: Harish Rao: కాళేశ్వరంపై ఇంకో కుట్ర.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు

ఇక, ఇంగ్లాండ్ లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ టెస్టులో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి.. అతడి కుడి పాదం వేళ్లకు బలంగా బంతి తాకింది.. దాంతో.. పంత్ నొప్పిని తట్టుకోలేక రిటైర్డ్ హర్ట్‌గా బయటకు వెళ్లిపోయాడు. అప్పటికే కాలు వేలు ఎముక విరిగిందని డాక్టర్లు చెప్పినా జట్టును ఆదుకోవాలని మళ్లీ తిరిగి క్రీజులోకి వచ్చి అర్థ శతకం కొట్టాడు. ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ సైతం భుజం నొప్పితో ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కు చేయలేదు. కాబట్టి, ఒకవేళ రీప్లేస్‌మెంట్ ఆటగాడిని అనుమతించి ఉంటే పంత్, వోక్స్‌లు అంతగా ఇబ్బంది పడేవారు కాదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, బీసీసీఐ రూల్ కి కొందరు మద్దతు ఇస్తుండగా.. మరి కొందరు ఇది సరైంది కాదని పేర్కొంటున్నారు.

Exit mobile version