Asia Cup 2025: ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కెప్టెన్సీలో ఆకట్టుకున్న గిల్ కు టీ20ల్లో కూడా వైస్ కెప్టెన్ గా బాధ్యతలను అప్పగించింది. బీసీసీఐ ప్రకటించిన ఆసియా కప్ టీ20 ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (ఉప కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్.
