Site icon NTV Telugu

Bajrang Punia: బ్రిజ్‌భూషణ్ 15 రూపాయల వ్యాఖ్యలపై పూనియా స్ట్రాంగ్ కౌంటర్

Bajrang Punia

Bajrang Punia

Bajrang Punia And Sakshi Malik Gives Strong Counter To Brij Bhushan: భారత రెజ్లర్లు సాధించిన పథకాలను వెలకడుతూ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెజ్లర్లు సాధించిన పథకాలు కనీసం రూ.15 కూడా విలువ చేయవని.. వాళ్లు తమ పథకాల్ని కాకుండా, కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగి ఇవ్వాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తామెంతో కష్టపడి సాధించిన పథకాలపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బ్రిజ్‌భూషణ్‌పై మండిపడుతున్నారు. తాజాగా ఒలింపిక్‌ మెడలిస్ట్‌ బజ్రంగ్‌ పూనియా సైతం ఆయనపై ధ్వజమెత్తాడు. ఆ మెడల్‌ని బ్రిజ్‌భూసణ్ తమకు భిక్షంగా ఇవ్వలేదంటూ కౌంటర్ వేశాడు.

Peedika Rajanna Dora: చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆగ్రహం

‘‘ఈ మనిషి (బ్రిజ్‌భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఏ పథకాలకైతే రూ.15 వెలకట్టాడో, దాని వెనకాల మా 15 సంవత్సరాల కష్టం ఉంది. నీలాంటి మనుషులు మాకు ఆ పథకాలను భిక్షంగా ఇవ్వలేదు. రాత్రనక పగలనక చెమటోడ్చి, మా రక్తం ధారపోసి, దేశం కోసం కోసం గెలిచిన పథకాలవి. ఆడవాళ్లను ఆటబొమ్మల్లా కాకుండా, ఆటగాళ్లను మనుషులుగా భావించి ఉంటే.. అతని నోటి నుంచి ఇలాంటి దిగజారుడు మాట వచ్చేది కాదు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా బజ్రంగ్ పూనియా విరుచుకుపడ్డాడు. అలాగే తన ట్వీట్‌కి బ్రిజ్‌భూషణ్ వ్యాఖ్యానించిన వీడియోని సైతం షేర్ చేశాడు. పూనియాతో పాటు మరో రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్‌భూషణ్‌కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని.. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది.

Icecream : ఆ ఐస్‌క్రీమ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ఇదిలావుండగా.. బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అతనికి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసి జైల్లో వేయాలని నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఒక ప్రత్యేక కమిటీ ఈ కేసుని విచారిస్తోంది.

Exit mobile version