IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!

  • ఐపీఎల్ 2026కి ముందు ఆర్సీబీ స్టార్ బౌలర్ దూరం అయ్యే అవకాశం..
  • గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ జాష్ హేజిల్‌వుడ్..
  • ఇంకా ఫిజియో పర్యవేక్షణలోనే బౌలర్..
Rcb

Rcb

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి మొదలవ్వనున్న ఈ 19వ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో మాత్రం ఒక ఆందోళనకరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సమస్యలు బెంగళూరు అభిమానులను కలవరపెడుతున్నాయి.

Also Read:Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..

గత సీజన్ హీరో ఇప్పుడు సందేహంలో..
దశాబ్దాల నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్‌సీబీ విజయంలో జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించారు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడమే కాకుండా… పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును విజేతగా నిలిపారు. అటువంటి కీలక బౌలర్ ఇప్పుడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..

యాషెస్ సిరీస్, భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమైన హేజిల్‌వుడ్.. ప్రస్తుతం ఫిజియోల పర్యవేక్షణలో కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయన ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధించలేదని సమాచారం. మార్చి 28 నాటికి ఆయన మైదానంలోకి దిగే అవకాశం ప్రస్తుతం 50-50 శాతంగానే ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

Also Read:GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

ఒకవేళ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2026 ప్రారంభానికి అందుబాటులో లేకపోతే.. అది ఆర్‌సీబీ బౌలింగ్ విభాగంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. టైటిల్ డిఫెండింగ్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టుకు.. ఈ స్టార్ పేసర్ గాయం పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. హేజిల్‌వుడ్ త్వరగా కోలుకోవాలని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.