NTV Telugu Site icon

Babar Azam: పాక్ టీంకు షాక్.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన బాబర్ ఆజమ్..

Babar Azam

Babar Azam

Babar Azam: ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ మాజీ క్రికెటర్లు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాల నేపథ్యంలో, బుధవారం అన్ని పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి వైదొగులుతున్నట్లు బాబార్ ఆజమ్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్నాడు.

కెప్టెన్సీ ఒక కారణమైతే.. ఈ మేజర్ టోర్నీలో బాబర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోవడం కూడా పాక్ అభిమానులకు మింగుడుపడటం లేదు. టోర్నీలోని 9 మ్యాచుల్లో బాబార్ 320 పరుగులు మాత్రమే చేశాడు. తదుపరి కెప్టెన్సీ బాధ్యతలను షహీన్ ఆఫ్రిదికి దక్కే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీకి అభినందనల వెల్లువ.. ప్రధాని మోడీ, సచిన్ ట్వీట్స్..

‘‘2019లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించాలని పీసీబీ నుంచి నాకు పిలుపు వచ్చిన క్షణం ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. గత నాలుగేల్లుగా నేను మైదానంలో, వెలుపల చాలా ఎత్తుపల్లాలను చూశానని, నేను నా హృదయపూర్వకంగా పాకిస్తాన్ ప్రతిష్టను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను, వైట్ బాల్ ఫార్మాట్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడంలో ఆటగాళ్లు, కోచ్, ఇతర జట్టు మేనేజ్మెంట్ సమిష్టి కృష్టి ఉంది, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అందించిన మద్దతుకు నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్ పదవీ విరమణ చేస్తున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఇది సరైన నిర్ణయంగా నేను భావిస్తున్నా’’ అని ఎక్స్(ట్విట్టర్)లో బాబర్ అజమ్ పోస్ట్ చేశారు. నేను మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తానని, నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్ కి మద్దతుగా నిలుస్తానని, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ట్వీట్ చేశారు.