Site icon NTV Telugu

David Miller: కోహ్లీ కన్నా బాబర్ బెటర్.. డేవిడ్ షాకింగ్ కామెంట్స్

Babar Vs Kohli

Babar Vs Kohli

Babar Azam Is Better Than Kohli In Cover Drives Says David Miller: ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఉత్తమ ఆటగాళ్లు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అఫ్‌కోర్స్.. రికార్డుల పరంగా ఇద్దరి మధ్య భూమికి, ఆకాశానికి అంత తేడా ఉన్నప్పటికీ.. బెస్ట్ బ్యాట్స్‌మెన్ ప్రస్తావన వస్తే మాత్రం వీళ్లిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే.. కొందరు మాత్రం అప్పుడప్పుడు అత్యుత్సాహంలో కోహ్లీ కంటే బాబర్ బెటర్ అని చెప్తుంటారు. ముఖ్యంగా.. పాకిస్తానీయులైతే తమ బాబరే గొప్ప ఆటగాడంటూ డప్పులు కొట్టుకుంటుంటారు. తమ వాళ్ల గురించి తాము గొప్పగా చెప్పుకోవడం సాధారణమే! కానీ.. క్రికెట్ ఫీల్డ్‌లో ఉంటూ కూడా కొందరు కోహ్లీ, బాబర్‌ని పోలుస్తూ చేసే వ్యాఖ్యలే హాస్యాస్పదంగా అనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు కోపం కూడా తెప్పిస్తాయి.

Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?

ఇందుకు లేటెస్ట్‌గా సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్లర్‌కు కోహ్లి, బాబర్‌ సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. కవర్‌డ్రైవ్‌ షాట్‌ విషయంలో ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. అందుకు మిల్లర్ బదులిస్తూ.. బాబర్ ఆజం అని సమాధానం ఇచ్చాడు. అతడు కొట్టే కవర్‌ డ్రైవ్‌ షాట్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. కోహ్లీతో పోలిస్తే బాబర్ చాలా బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో.. కోహ్లీ అభిమానులు డేవిడ్ మిల్లర్‌ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడుతున్నంత మాత్రాన.. బాబర్‌కు మద్దతుగా కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతావా? అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చూస్తుంటే.. తాను చేసిన ఈ వ్యాఖ్యలు అతనిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌‌లో మిల్లర్ ‘మూల్తాన్‌ సుల్తాన్స్‌’కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Harish Rao: కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?

Exit mobile version