Axar Patel: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో అతడు 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. దీంతో భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా అక్షర్ పటేల్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో బరిలోకి దిగి 65 పరుగులు ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు జడేజా పేరిట ఉండేది. అతను కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 23 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ జడేజాను అధిగమించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Read Also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర
మరోవైపు ఈ మ్యాచ్‌లో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా ఏడో స్థానంలో బరిలో దిగిన అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తం ఆరు భారీ సిక్సర్లు, మూడు ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున ఇది ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అదే సమయంలో ఆరు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గానూ అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు.