T20 World Cup: ఆస్ట్రేలియాను హడలెత్తించిన ఆప్ఘనిస్తాన్.. తృటిలో తప్పిన పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని జట్టు ఆప్ఘనిస్తాన్ మాత్రమే. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా అవి వరుణుడి కారణంగా వచ్చాయి. అయితే తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ గెలిచినంత పని చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు తుదికంటా పోరాడింది. కానీ తృటిలో విజయం చేజార్చుకుంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఆసీస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. స్టాయినీస్ వేసిన చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా రషీద్ విజృంభణతో 17 పరుగులు మాత్రమే వచ్చాయి.
Read Also: T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్.. కివీస్‌పై దుమ్ముదులిపిన ఐర్లాండ్ బౌలర్
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
అంతకుముందు ఈ మ్యాచ్ టాస్ గెలిచి ఆప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. ఎట్టకేలకు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వచ్చాడు. అతడు హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 45 పరుగులు, స్టాయినీస్ 25 పరుగులు చేశాడు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు, ఫజల్లా ఫరూఖీ 2 వికెట్లతో రాణించారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. కాగా ప్రపంచకప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరాలంటే శనివారం నాడు ఇంగ్లండ్‌పై శ్రీలంక గెలవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..