Site icon NTV Telugu

AUS vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత జట్టులో మార్పులు..!

Aus

Aus

AUS vs IND: ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా తలపడుతుంది. బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక, ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్‌ తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బర్త్‌డే బాయ్‌ తిలక్‌ వర్మకు రెస్ట్ ఇచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలియజేశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఆసీస్‌ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఫలితంగా 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ గాబాలో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని చూస్తుంది.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.

భారత్ ప్లేయింగ్ XI..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేశ్ శర్మ(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

Exit mobile version