యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖవాజాకు ఆస్ట్రేలియా టీమ్ విజయంతో అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. 88 టెస్టుల కెరీర్‌లో ఆస్ట్రేలియాకు చేసిన సేవలకు ఘనంగా గుర్తింపు లభించింది. సిడ్నీ టెస్టు అనంతరం తాను రిటైరవనున్నట్లు ఖవాజా ప్రకటించిన విషయం తెలిసిందే.
160 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఐదో రోజు లంచ్ తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. లక్ష్యం చిన్నదే అయినా ఇంగ్లాండ్ బౌలర్లు గట్టిగా పోరాడడంతో.. ఆస్ట్రేలియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29), జేక్ వెదరాల్డ్ (34) మంచి ఆరంభం ఇచ్చినా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (12) త్వరగా పెవిలియన్ చేరాడు. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు. క్యామరన్ గ్రీన్ (22), అలెక్స్ కేరీ (16) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఆధిపత్యంతో ముగించగా.. ఇంగ్లాండ్ మరోసారి నిరాశకు గురైంది.
Also Read: Tilak Varma: టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం!
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 384 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా 567 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 342 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యాషెస్ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు పడగొట్టిన పేసర్ మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (163) చేసిన రన్స్ చేసిన ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
