2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గవ టెస్టులో (బాక్సింగ్ డే టెస్ట్) ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో రోజు 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై పరాజయాల పరంపరకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. దాదాపు 15 సంవత్సరాల (5,468 రోజులు) అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లీష్ టీమ్ విజయం సాధించడం గమనార్హం.
ఈ విజయంతో ఆస్ట్రేలియాలో వరుసగా 18 పరాజయాల పరంపరకు ఇంగ్లండ్ ముగింపు పలికింది. ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ చివరగా 2011లో విజయం సాధించింది. దాంతో మెల్‌బోర్న్‌లో జరిగిన 2024-26 యాషెస్ సిరీస్‌లో పర్యాటక జట్టు విజయం చారిత్రాత్మకమైనదిగా నిలిచింది. 14 సంవత్సరాల క్రితం జనవరి 2011లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 83 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ యాషెస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో వరుసగా 18 టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ ఓడిపోయింది. చివరకు 19వ మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ విజయం అందుకుంది.
Also Read: Vijay Hazare Trophy 2025-26: విజయ్ హజారే ట్రోఫీ.. రో-కోల మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?
175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 152 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 110 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 132 రన్స్ చేసిన ఆసీస్.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 రన్స్ కలుపుకొని 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.