Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. బోరున విలపించిన కెప్టెన్ సల్మాన్ అఘా!

Pak

Pak

Pakistan: దుబాయ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్ అఘాకు ఘోర అవమానం జరిగింది. అఫ్ఘానిస్థాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పాక్‌ సారథిని ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అటు నవ్వలేక, ఇటు ఏడ్వలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా అంటూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Power Star : ‘OG’ ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్.. పవర్ స్ట్రోమ్

అయితే, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్‌ స్టార్ట్ కాబోతుంది. వచ్చే నెల 5న యూఏఈకి టీమిండియా చేరుకోనునంది. ఇప్పటికే అక్కడికి పాకిస్థాన్, శ్రీలంక టీమ్స్ చేరాయి. ఈ సందర్భంగా ఆయా జట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడ ఓ జర్నలిస్ట్ ‘ఆసియాలోనే రెండో అత్యుత్తమ జట్టు అఫ్గనిస్థాన్ గత వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడింది.. మరి ఈసారి ఆసియా కప్‌ కోసం ఎలా రెడీ అవుతున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆ పక్కనే ఉన్న పాక్‌ కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు కింది వీడియోలో కనిపించింది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్‌ టీమ్ అంటే గతంలో ఓ మర్యాద ఉండేది. కానీ, ఈసారి మాత్రం బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతోనే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని నెట్టింట చర్చ జరుగుతుంది.

Read Also: Ashwin Exit IPL: రిటైర్‌మెంట్ సీక్రెట్ రివీల్ చేసిన అశ్విన్

కాగా, ఆసియా కప్‌లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్థాయి నుంచి సూపర్ 4లోకి రెండు టీమ్స్ అడుగుపెడితే మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. ఇక, ఫైనల్‌కు చేరితే మూడోసారి దాయాదుల మధ్య పోరును చూసే ఛాన్స్ అభిమానులకు వస్తుంది. కానీ, పాక్‌తో ఆడొద్దని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దేశంతో ఎలాంటి సంబంధాలూ ఉండొద్దనే డిమాండ్ వినిపిస్తుంది.

Exit mobile version