NTV Telugu Site icon

Asia Cup 2023: ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్

Asia Cup 2023

Asia Cup 2023

Asia Cup 2023: ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. అక్టోబరులో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. అయితే అంతకంటే ముందే ఆసియా కప్ కూడా జరగనుంది. ఈ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సి ఉండగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం వేదికగా విషయాన్ని ప్రస్తావించలేదు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ సందిగ్థత వ్యక్తం చేయడంతో ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందో ఇంకా క్లారిటీ రాలేదు.

Read Also: Gold Price: కొండెక్కిన బంగారం.. పది గ్రాముల బంగారం ఎంతంటే..

కాగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీలో ఆరు జట్లు తలపడతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో క్వాలిఫయర్ జట్టు తలపడుతుంది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ రెండేళ్ల క్యాలెండర్‌ను జై షా ప్రకటించడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పుబట్టింది. ఆయన ఏకపక్షంగా వ్యవహరించాడని ఆరోపించింది. పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఆసియాకప్ షెడ్యూల్‌ను ప్రకటించినందుకు కృతజ్ఞతలు అని.. పీఎస్ఎల్ 2023 క్యాలెండర్ కూడా ప్రకటించాలంటూ జై షాను ఉద్దేశించి చురకలు అంటించింది.