Asia Cricket Council Gives Green Signal For Hybrid Model For Asia Cup 2023: ఆసియా కప్ 2023 నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌లో అడుగుపెట్టదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తేల్చి చెప్పడంతో.. హైబ్రిడ్ మోడల్‌ని పాక్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే! అందుకు తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనూ, భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలోనూ నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది.
Rohit Sharma: అదే మా కొంపముంచింది.. ఓటమిపై రోహిత్ రియాక్షన్
ఈ ఆసియా కప్ 2023లో భాగంగా.. మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. ఆ మొత్తం మ్యాచ్‌ల్లో నుంచి కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్‌లే పాక్‌లో జరిగే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్‌లతో పాటు భారత్ ఆడే మిగతా మ్యాచ్‌లు అన్నీ.. శ్రీలంక వేదికగా జరుగుతాయి. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరితే, అది కూడా శ్రీలంకలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇదే సమయంలో.. ఈ టోర్నీలో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని తేలింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా.. సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే.. ఈ ఆసియా కప్ విషయమై అధికారక ప్రకటన రానుంది.
CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్‌కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు
నిజానికి.. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌కే ‘ఆసియా కప్ 2023’ నిర్వహణ హక్కులు దక్కాయి. అయితే.. భారత్, పాక్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో.. భారత జట్టును పాక్‌కు పంపిచేందుకు బీసీసీఐ నిరాకరించింది. మరో దారి లేక.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. ఇందుకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు మాత్రం అక్కడ ఎండలు మండిపోతాయని చెప్పి, ఆ ప్రతిపాదనని నిరాకరించాయి. ఫైనల్‌గా ఏసీసీ శ్రీలంక పేరుని ప్రసాదించగా.. అందుకు అన్ని దేశాలు సమ్మతమేనని చెప్పాయి.