India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Nehra on Team India Head Coach Role: టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రస్తుతం మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి జట్టు ప్రదర్శన నేపథ్యంలో గంభీర్‌పై తరచూ విమర్శలు వస్తుండటంతో.. భవిష్యత్తులో హెడ్ కోచ్ పదవికి ఎవరు సరైన వ్యక్తి అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, 2011 ప్రపంచ కప్ విజేత ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపిస్తోంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు విజయవంతమైన హెడ్ కోచ్‌గా ఉన్న నెహ్రా.. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశంపై తాజాగా స్పందించాడు. నెహ్రా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హెడ్ కోచ్ పదవి నా యాంబిషన్ కాదు:
భారత జట్టుకు కోచ్‌గా పనిచేయాలనే ఆశ తనకు పెద్దగా లేదని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టాలనే ఆశ నాకు లేదు. అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే పూర్తిగా తిరస్కరించబోను. టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం గొప్ప గౌరవం, ప్రతిష్ఠాత్మకమైన అవకాశం. టీమిండియా హెడ్ కోచ్ పదవి నా యాంబిషన్ కాదు. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాలను ముందుగా ప్లాన్ చేసుకోను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం నేను నా పనితో చాలా సంతోషంగా ఉన్నాను’ అని నెహ్రా పేర్కొన్నాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
అది సరైంది కాదు:
గుజరాత్ టైటాన్స్‌తో తన కోచింగ్ విజయాల గురించి కూడా ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జట్టు బాగా ఆడితే అందుకు కోచ్, కెప్టెన్‌కు క్రెడిట్ రావడం సహజమే. కానీ విజయాన్ని పూర్తిగా నా ఖాతాలో వేసుకోను. అది సరైంది కాదు. ప్లేయర్స్ కష్టపడితేనే విజయం సాధ్యమవుతుంది.’ అని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే 2022లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2023, 2026 సీజన్లలో టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది. దీంతో నెహ్రా కోచింగ్ సామర్థ్యంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
హెడ్ కోచ్ పదవి అంత సులభం కాదు:
టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించడం అంత సులభమైన విషయం కాదని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌గా పనిచేస్తే, ముఖ్యంగా టీమిండియాకు హెడ్ కోచ్ అయితే ఎక్కువ సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి వస్తుంది. ఒకవేళ బీసీసీఐ సంప్రదిస్తే ముందుగా నేను నా భార్యతో మాట్లాడాలి. ఆమె నా హై కమిషన్. లేదంటే నాకు విడాకులు వచ్చేస్తాయి’ అంటూ నెహ్రా సరదాగా వ్యాఖ్యానించాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటే ఏడాదిలో సుమారు 8 నుంచి 9 నెలలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, అది అంత తేలికైన విషయం కాదని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ కోచింగ్‌లో సవాళ్లు:
అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌గా ఎక్కువ కాలం కొనసాగడం కూడా కష్టమేనని నెహ్రా చెప్పాడు. సాధారణంగా చాలామంది కోచ్‌లు మూడు లేదా నాలుగేళ్లకు మించి కొనసాగలేకపోతున్నారని.. అంతటి బాధ్యతలు, ఒత్తిడి, నిరంతర ప్రయాణాలు దీనికి కారణమని వివరించాడు. ప్రస్తుతం తాను గుజరాత్ టైటాన్స్‌తో సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని నెహ్రా చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!