ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత ప్రయాణంతో పాటుగా… టీ20 ఫార్మాట్ లో ఇండియా జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ప్రయాణం కూడా ముగిసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాదే మరో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఉండటంతో.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండ ఉండాలని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని ఎవరు అందించలేరని నెహ్రా సూచించాడు. మీరు కోహ్లీని దూరంగా ఉంచి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ మరియు హార్దిక్ పాండ్య వంటి దూకుడు బ్యాటర్ లతో ముందుకు వెళ్ళితే… అది ప్రతిసారీ పనిచేయదు. విరాట్ కోహ్లీ కంటే మెరుగైన స్థిరత్వాన్ని బ్యాటింగ్ ఆర్డర్‌కు ఎవరూ అందించలేరు అని నెహ్రా అన్నాడు. ఇక ఇటీవలి కాలంలో భారత జట్టులో దూకుడు ఎక్కువగా ఉండే బ్యాటర్లను చూశామని, అలాంటి పవర్ హిట్టర్లలో భారత్ టీ10 క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నప్పటికీ, విరాట్ కోహ్లిదే పెద్ద పాత్ర అని నెహ్రా అన్నాడు.
ఆ విషయంలో కోహ్లీనే అందరికంటే గ్రేట్…
