NTV Telugu Site icon

Ashes Test 2023: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!

Untitled Design (2)

Untitled Design (2)

Australia Creates Several Records after Beat England in Ashes 2023 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్‌ 2023 తొలి టెస్టులో ఓటమి ఖాయం అనుకున్నా.. గొప్పగా పోరాడిన ఆస్ట్రేలియా అద్భుత విషయం సాధించింది. ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా (65; 197 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. చివరి రోజు మ్యాచ్‌ చేజారుతున్న దశలో కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ (44 నాటౌట్‌; 73 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆసీస్ ముందంజ వేసింది. ఇక తర్వాతి టెస్ట్ మ్యాచ్‌ ఈ నెల 28న మొదలవుతుంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

# ఇంగ్లండ్‌ గడ్డపై విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదవసారి. 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను ఛేదించగా.. 1984లో లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌ 342 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. 2017లో హెడ్డింగేలో వెస్టిండీస్‌ 322 పరుగుల టార్గెట్‌ను సాధించగా.. 2008లో ఎడ్జ్‌బాస్టన్‌లో దక్షిణాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసింది.

# యాషెస్‌ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఆస్ట్రేలియా జట్టుకు ఇది ఐదోసారి. 1948లో హెడ్డింగేలో 404 పరుగుల టార్గెట్‌, 1902లో అడిలైడ్‌లో 315 పరుగుల టార్గెట్‌, 1929లో మెల్‌బోర్న్‌లో 286 పరుగుల టార్గెట్‌, 2023లో ఎడ్జ్‌బాస్టన్‌లో 281 పరుగుల టార్గెట్‌, 1897-98లో సిడ్నీలో 275 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.

# ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని చేధించడం ఇది 15వ సారి. ఈ ఏడాదే ఐదుసార్లు ఛేదించింది.

Also Read: Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

# టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులు, బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడు పాట్ కమిన్స్‌. ఇదివరకు బాబ్‌ సింప్సన్‌ నాలుగు సార్లు, జార్జ్‌ గిఫెన్‌ రెండు సార్లు.. వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, రిచీ బెర్నాడ్‌, అలెన్‌ బోర్డర్‌ తలా ఒకసారి ఈ ఘనత అందుకున్నారు.

# ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్‌ కమిన్స్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కమిన్స్‌ ఐదు సిక్సర్లు బాదాడు. 2005లో రికీ పాంటింగ్‌ న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. 1972లో ఇయాన్‌ చాపెల్‌ పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు బాది మూడో స్థానంలో ఉన్నాడు.

Also Read: Maruti Upcoming Car Launch: 35కిమీ మైలేజీతో రెండు చౌకైన కార్లను విడుదల చేస్తున్న మారుతి!